అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన వర్గల్ విద్యా సరస్వతి
13-10-2026 | 06:17pm
గజ్వేల్ అక్టోబర్ 13: సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని విద్యా సరస్వతి క్షేత్రంలో(Vidya Saraswati Kshetram) దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవరోజు విద్యాసరస్వతి అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి చతుష్యష్ట్యూపచార పూజలు, భక్తులకు నిత్యాను దానం నిర్వహించారు.