కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన రైతులు
ఖానాపూర్,(విజయక్రాంతి): సదర్ మార్ట్ ప్రాజెక్టు(Sadar Mart Project) నుంచి చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ భవే ష్ మిశ్రా(Collector Bhavesh Mishra)కు రైతులు(Farmers ) కృతజ్ఞతలు తెలిపారు. సదర్ మట్ కాల్వ ద్వారా చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందకపోవడంతో వరి పంట ఎండిపోతుందని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
వెంటనే కలెక్టర్ స్పందించి సదరమెట్రి సందర్శించి అక్కడ ఉన్న నీటి సామర్థ్యం పరిశీలించి చివరి న్యాయకట్టుకు ఒక్కతాడికి నీరు ఇవ్వాలని అధికారులకు సూచించారు. అధికారులు నీటి విడుదల(Water Supply) చేయడంతో సాగునీరు పొందగా పంటలకు మేలు జరిగిందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. సాగునీరు అందించేందుకు కృషి చేసిన కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు.