విద్యారంగంలో సేవలకు గుర్తింపు
ప్రధానోపాధ్యాయుడు కూరెళ్లి శ్రీనివాస రెడ్డికి టీచర్ అవార్డు
కొండపాక (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూరెళ్లి శ్రీనివాస రెడ్డి(Kurelli Srinivasa Reddy)కి అరుదైన గౌరవం లభించింది. విద్యారంగంలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ‘గురువందనం–2026 ఎడ్యుకేషన్ కాన్‌క్లేవ్ అండ్ టీచర్స్ అవార్డ్స్’ కార్యక్రమానికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖుల చేతుల మీదుగా ఆయన ఘనంగా సన్మానం అందుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, ఎమ్మెల్సీ పాల్ రాజేశ్వర్ రెడ్డి తదితర ప్రముఖుల చేతుల మీదుగా శ్రీనివాస రెడ్డి అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు అందుకోవడంతో విద్యా వర్గాలు, ఉపాధ్యాయులు స్థానికులు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులుగం దామోదర్ రెడ్డి, పీఆర్టీయూ అధికార ప్రతినిధి వంగా మహేందర్ రెడ్డి, సిద్దిపేట జిల్లా శాఖ అధ్యక్షుడు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.