యాదవ సంఘం అధ్యక్షుడిగా నలువాల స్వామి

08-10-2026 | 10:39pm

బెజ్జంకి,(విజయక్రాంతి): అఖిల భారత యాదవ మహాసభ(All India Yadav Mahasabha) బెజ్జంకి మండల(Bejjanki Mandal) అధ్యక్షుడిగా వడ్లూరుకు చెందిన నలువాల స్వామి యాదవ్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా స్వామి యాదవ్(Nalvala Swamy Yadav) మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్న యాదవ కులబాంధవులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ముందుంటానని, ఐక్యతతో విద్య, వైద్యం, రాజకీయ రంగాల్లో యాదవులు అభివృద్ధి సాధించేలా కృషి చేస్తానన్నారు.

ఎన్నికల ఇన్‌చార్జిగా సిద్దిపేట జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు మామిండ్ల ఐలయ్య యాదవ్ వ్యవహరించి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దొంతరవేణి శ్రీనివాస్ యాదవ్, యువజన జిల్లా అధ్యక్షుడు రాము యాదవ్, మేకల శ్రీకాంత్ యాదవ్, జెల్ల ప్రభాకర్ యాదవ్, వివిధ గ్రామాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు