మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి
2వ వార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ
సిద్దిపేట రూరల్, అక్టోబర్ 13 విజయక్రాంతి : పట్టణంలోని 2వ వార్డులో మహిళా సంఘాల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress party leaders) ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం వడ్డీలేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తోందన్నారు.
మహిళల గౌరవం, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి ఎర్రబోలు రాజారెడ్డి, ఓబీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జొంగొని శ్రీనివాస్ గౌడ్, 2వ వార్డు అధ్యక్షుడు నాయిని సాయిమల్లు, ఉపాధ్యక్షులు బండారి కనకరాజు, మోత్కూరి కనకయ్య, మోత్కూరి యాదగిరి, కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.