సొంత ఇంట్లోనే దొంగతనం
నిందితుడు ఇంటి యజమాని
నిర్మల్ అక్టోబర్ 13 ( విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని గాజులపేట్ కాలనీలో రెండు రోజుల క్రితం దొంగతనం జరగగా కేసు చేదించినట్టు పట్టణ సిఐ సమ్మయ్య తెలిపారు. మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్లో(City Police Station) వివరాలు వెల్లడించారు. గాజులపేట కాలనీ చెందిన మహమ్మద్ అషోద్అహ్మద్ కొన్ని రోజులుగా మటక జూదం ఇతర వ్యసనాలకు బానిసైనట్టు తెలిపారు.
జలసాలకు అలవాటుపడ్డ ఈ వ్యక్తి రెండు రోజుల క్రితం చేతిలో డబ్బు లేకపోవడంతో సొంత ఇంట్లో ఉన్న బంగారం వెండి ఇతర నగలను అర్ధరాత్రి దొంగలిచ్చినట్టు సీఐ వివరించారు. ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అన్ని కోణాల్లో విచారణ జరిపినట్టు తెలిపారు. యజమాని అయిన మహమ్మద్ అహ్మద్ పై హనుమాన్ రావడంతో సాంకేతిక ఆధారాలతో పట్టుకోవడం జరిగిందని తెలిపారు.
దొంగతనం చేసిన బంగారు వెండి ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుందామని బైకులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జల్సాలకు అలవాటు పడి సొంత ఇంటిలోనే బంగారం వెండి దొంగతనం చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ పోలీస్ సిబ్బంది ఉన్నారు