ఎల్ఐజీ కాలనీ ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ

29-10-2026 | 09:58pm

రామచంద్రపురం: భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి చొరవతో ఎల్.ఐ.జి. కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సేల్స్‌ఫోర్స్ కంపెనీ, నిర్మాణ్ సంస్థ సహకారంతో ఆధునీకరించారు. పాఠశాలలో ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులు, పెయింటింగ్, లీకేజీల మరమ్మతులు, ఫ్లోరింగ్ పనులు చేపట్టడంతో పాటు పిల్లల కోసం ఆర్ట్ వర్క్, ఆట పరికరాలను ఏర్పాటు చేశారు.

విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ పనులను సింధు ఆదర్శ్ రెడ్డి స్వయంగా పరిశీలించి, నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి సహకరించిన సేల్స్‌ఫోర్స్ ప్రతినిధి పాండురంగారావు గారికి, నిర్మాణ్ సంస్థ సభ్యులు నికీ, సౌమ్యలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు శౌర్య,రాజకుమారి, ఎల్.ఐ.జి. కాలనీ అధ్యక్షులు యాదగిరి రెడ్డి, సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు