జహీరాబాద్ నియోజకవర్గంలో కాన్షీరామ్ గారి 20వ వర్ధంతి
జై భీమ్! జై తెలంగాణ! జై బహుజన !జై భారత రాజ్యాంగం ! జై భీమ్ ఆర్మీ!!
జహీరాబాద్ టౌన్, అక్టోబర్ 9: జహీరాబాద్ నియోజకవర్గంలో(Zaheerabad constituency) మహనీయులు మాన్యవర్ కాన్షీరామ్(Kanshi Ram) గారి 20వ వర్ధంతి సందర్భంగా భీమ్ ఆర్మీ జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ అలీమ్(Mohammed Aleem) గారి ఆధ్వర్యంలో కాన్షీరామ్ గారికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) అధ్యక్షులు సిద్దు రావణ్ గారు మాట్లాడుతూ బహుజనుల చైతన్యానికి బాటలు వేసిన మహనీయుడని , సామాజిక మార్పుకు స్ఫూర్తి ప్రదాత అని అధికారం లేని సమాజానికి ఆత్మగౌరవం, సమానత్వం సాధించడం కష్టసాధ్యమని రాజకీయ చైతన్య సందేశాన్ని బహుజనులలో విస్తరించిన దర్శనీకుడు.
అంబేద్కర్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బహుజన సమాజంలో హక్కుల పట్ల అవగాహన పెంపొందించి కుల వివక్షతకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల హక్కుల కోసం సమాన అవకాశాల సాధన కోసం నిరంతరం కృషి చేసిన పోరాటయోధుడని తెలియజేశారు. కాన్షి రామ్ గారు మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన నాటిన బహుజన చైతన్య బీజాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు.
కాన్షీరామ్ గారి ఆశయాల సాధనే మన నిజమైన నివాళి . బహుజన ఐక్యత , సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణే భీమ్ ఆర్మీ ముందున్న కర్తవ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సుభాష్ బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ధనరాజ్ బాల్రాజ్ విజయ్ కుమార్, అనంతరం ,రాకేష్ మామయ్య, నరసింహులు ముదిరాజ్ ,ప్రేమ్ కుమార్ , పండరి, రాచన్న చంద్రయ్య, బలరాం, గోపాల్, గౌతమ్ కృష్ణ, జైపాల్, రామ్ చందర్, తదితరులు పాల్గొన్నారు.