సంస్కృతి సైబర్ అవగాహనల సమ్మేళనం
సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ దాండియా
శేరిలింగంపల్లి, అక్టోబర్ 1౮ (విజయక్రాం తి): సాంస్కృతిక వేడుకలతో పాటు ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) వినూత్నంగా సైబర్ దాండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ నాయకత్వంలో, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ), సైబ రాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమానికి సు మారు 1,500 మంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీపీ రమేష్ మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్, పెట్టుబడులు, ట్రేడింగ్ మోసా లు, ఫిషింగ్, ఓటీపీ మోసాలు, నకిలీ లింకు లు, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో జరిగే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీలు, పాస్వర్డ్లు, పిన్ నంబర్లు, బ్యాంకు వివరాలను ఇతరులతో పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులను తెరవవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.
డీసీపీ సైబర్ క్రైమ్స్ పుష్ప మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ప్రజల భయం, అత్యాశ, నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారని, గుర్తుతెలియని కాల్స్, వీడియో కా ల్స్, నకిలీ పెట్టుబడి పథకాలు, ఏపీకే ఫైల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సైబరాబాద్ మున్సిప ల్ కమిషనర్ సృజన, డీసీపీలు అన్నపూర్ణ, పుష్ప, లావణ్య, రితిరాజ్, ఎస్. శేషాద్రిని రెడ్డి, శ్రీనివాస్, సంజీవ్, పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది, ఐటీ సంస్థల ప్రతినిధులు, మహిళలు, యువత, ప్రజలు పాల్గొన్నారు. దాండియా నృత్యాలతో పాటు సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైంది.