ఫ్యూచర్ సిటీపై సీఎం స్పెషల్ ఫోకస్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఫ్యూచర్ సిటీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నంలో మధ్యాహ్నం 3.30 గంటలకు నూతన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ (Police Commissionerate)ను ప్రారంభించనున్నారు. అనంతరం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించనున్నారు. యూనివర్సిటీ నిర్మాణ పనులపై అధికారులతో వివరాలు తెలుసుకోనున్నారు. అలాగే ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయనున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ (NIUM) నూతన క్యాంపస్‌కు భూమిపూజ చేసి శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ (Master Plan), మౌలిక వసతులు, రవాణా అనుసంధానం (Connectivity), భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.