సందడిగా సద్దుల బతుకమ్మ

19-10-2026 | 05:20am

సందడే సందడి..

తెలంగాణ సంస్కృతి(Culture of Telangana), సంప్రదాయాలకు  ప్రతీక గా నిలిచే బతుకమ్మ సంబరాలు(Bathukamma Celebrations) ముగింపు  సందర్భంగా ఆదివారం వెంకటేశ్వర కాలనీ పార్కు లో వేణు , శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యం లో సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు .ఈ వేడుకల్లో మహిళలు , చిన్నారులు ఆట , పాటలతో సందడి చేసారు. రంగు రంగుల పుష్పాలతో బతుకమ్మలను పేర్చి  బతుకమ్మ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు.

 -మణికొండ, విజయక్రాంతి

  1. సనత్‌నగర్‌లో బతుకమ్మ సంబురాలు
  2. నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ కోట నీలిమ

సికింద్రాబాద్, అక్టోబర్ 1౮ (విజయక్రాం తి): మహిళలంతా ఒకచోట చేరి సంప్రదా య బద్ధంగా బతుకమ్మ సంబరాలను(Bathukamma Celebrations) నిర్వహించడం ఆనందంగా ఉందని డాక్టర్ కోట నీలిమ అన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బీకే గూడ, సనత్‌నగర్ డివిజన్ జేకే కాలనీ అపార్ట్మెంట్స్, బన్సీలాల్‌పేట్ డివిజన్లలో నిర్వహించిన బతుకమ్మ, దుర్గామాత నవరాత్రి వేడుకల్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ పాల్గొన్నారు.

స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, అపార్ట్మెం ట్స్ అసోసియేషన్ సభ్యుల ఆహ్వానం మేర కు ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకలకు హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు బతుకమ్మ పండు గ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలతో కలిసి సంబరాల్లో భాగస్వాములయ్యారు. ఈసందర్భం గా ఆమె మాట్లాడుతూ  బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు, మన సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తుం దని డాక్టర్ కోట నీలిమ పేర్కొన్నారు.

సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు కుటుంబ సభ్యులు

కూకట్‌పల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

కూకట్‌పల్లి, అక్టోబర్ 18 (విజయక్రాం తి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు కూకట్పల్లిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో పండుగ సంబరాలను జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు దంపతులు, యామిని పాల్గొని బతుకమ్మ సంబరాల్లో భాగస్వాములయ్యారు.

పూల పండుగగా ప్రసిద్ధి చెందిన బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా పండుగ వాతావరణం ప్రతిబింబించింది. సాంప్రదాయ పాటలు, కోలాటాలు, బతుకమ్మ ఆటలతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని ఈ వేడుకలు చాటిచెప్పాయి.

కూకట్‌పల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

కూకట్‌పల్లి, అక్టోబర్ 18 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలలో చివరి రోజైనా సద్దుల బతుకమ్మ వేడుకలను కూకట్ పల్లిలోని బతుకమ్మ గ్రౌండ్‌లో  ఘనంగా నిర్వహించారు. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని సద్దుల బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక శోభ తీసుకువచ్చారు. సాయంత్రం ఐదు గంటలకే ప్రారంభమైన బతుకమ్మ వేడుకల్లో రాత్రి 10 గంటలవుతున్న మహి ళలు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. చిట్టి పొ ట్టి చిన్నారులు సైతం బతుకమ్మ ఆడుతూ అందరిని ఆకట్టుకున్నారు. వేడుకలకు కూకట్‌పల్లి పోలీ సులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

భక్తిశ్రద్ధలతో సద్దుల బతుకమ్మ

  1. సంప్రదాయ దుస్తుల్లో సందడి చేసిన ఆడపడుచులు
  2. ఆటపాటలతో మార్మోగిన బతుకమ్మ వేడుకలు

మేడిపల్లి, అక్టోబర్ 18 (విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి లో సద్దుల బతుకమ్మ ఉత్సవాలను ఆడపడుచు లు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా నిర్వహించా రు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూ జలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించి, మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాలు, ఆటపాటలతో సం దడి చేశారు. ఈ  సందర్భంగా అమ్మవారిని భక్తితో కొలుస్తూ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థిం చారు.  తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు, ప్రకృ తి ప్రేమకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే లా వేడుకలు జరుపుకొన్నారు.

కాచిగూడలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

నీలకంఠం సంఘం ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా వేడుకలు హాజరైన అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ 

ముషీరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాం తి): కాచిగూడలోని బతుకమ్మకుంటలో నీలకంఠం సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సం బరాలను ఆదివారం ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సం ఖ్యలో పాల్గొని, సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సందడి చేశా రు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నా రు. సంప్రదాయ పాటలు పాడుతూ, బతుకమ్మ చుట్టూ ఆడిపాడుతూ  సందడి చేశా రు. వేడుకలను అంబర్‌పేట ఎమ్మెల్యే కాలే రు వెంకటేష్ తిలకించారు.

ముషీరాబాద్, అంబర్‌పేటలో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

  1. బతుకమ్మ వేడుకలతో మహిళలు యువతులు చిన్నారులతో సందడిగా మారిన నియోజకవర్గాలు 
  2. వేడుకలను తిలకించిన ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ 

ముషీరాబాద్/ అంబర్‌పేట, అక్టోబర్ 18 (విజయక్రాంతి): ముషీరాబాద్, అంబర్ పే ట నియోజకవర్గాల్లోని పలు డివిజన్లో బస్తీ లు, కాలనీలలో మహిళలు సద్దుల బతుక మ్మ వేడుకలను ఆదివారం అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు. ఎంగిలి పూలతో ప్రారంభమైన బతుకమ్మ ఉత్సవాలు తొమ్మి ది రోజులపాటు గౌరీదేవి పూజలందుకొని బతుకమ్మలను ఆయా డివిజన్లోని జిహెచ్‌ఎంసి ఏర్పాటు చేసిన తాత్కాలిక కొలనుల లో నిమజ్జనం చేస్తూ పోయి రావమ్మ గౌర మ్మ తల్లి అంటూ మహిళలు యువతులు చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరై నిమజ్జనం చేశారు.

ముషీరాబాద్ నియోజకవర్గం లోని కవాడిగూడ, భోలక్ పూర్, ముషీరాబాద్, అడిక్మెట్, రాంనగర్, గాంధీనగర్, అదేవిధంగా  అంబర్ పేట నియోజకవర్గం లోని బాగ్ అంబర్ పేట, నల్లకుంట, గోల్నా క, అంబర్ పేట, కాచిగూడ, డివిజన్లలో మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని ప్రధాన కూడళ్ళలో బతుకమ్మలను పెట్టి ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జామునాయే చందమామ.. చిత్తూ చిత్తుల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ సంబరాలను వైభవంగా జరుపుకొన్నారు.

ఈ బతుకమ్మ వేడుకలను ము షీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆయా డివిజన్లో మాజీ కార్పొరేటర్లు తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకా యన బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు. ప్రజ లంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు