బతుకమ్మ తెప్పల నిర్మాణాలను పరిశీలించిన
సర్పంచ్ గండి నారాయణ
రుద్రంగి అక్టోబర్09(విజయక్రాంతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) రుద్రంగి మండలకేంద్రంలో నిర్మిస్తున్న బతుకమ్మ తెప్పల నిర్మాణాలను సర్పంచ్ గండి నారాయణ(Sarpanch Gandi Narayana), మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి,ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్,వార్డు మెంబర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.గ్రామంలోని మహిళ తల్లులు బతుకమ్మ ఆడేందుకు వీలుగా ఉండేలా చెరువుల వద్ద కుంటల వద్ద బతుకమ్మ తెప్పలను నిర్మిస్తున్నట్టు తెలిపారు.ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Adi Srinivas) బతుకమ్మ తెప్పల నిర్మణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు.బతుకమ్మ ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
తెప్పల నిర్మాణం పూర్తి అయిందని బతుకమ్మ పండుగ వరకు పేంటింగ్ పనులు కూడా పూర్తవుతయని అన్నారు.తాను సర్పంచ్ గా నిర్వహిస్తున్న మొదటి బతుకమ్మ కాబట్టి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నామని అన్నారు.వీధి దీపాలు, రోడ్డు మరమ్మత్తులు,పిచ్చి మొక్కల తొలగింపు వంటి పనులను చేపడుతున్నాట్టు తెలిపారు. మహిళలు బతుకమ్మ ఆడే ప్రదేశంలో సౌండ్ సింస్టమ్,లైటింగ్ సిస్టమ్, ఏర్పాటు చేస్తునట్టు తెలిపారు.అందరికి ముందస్తుగా బతుకమ్మ దసరా పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో,వార్డు మెంబర్లు శీలం స్వాతి మీనయ్య,గాసికంటి రాజు,గుగ్గిల్ల వెంకటేష్, గంధం మనోజ్,ఎర్రం అరవింద్, పుట్కపు మహిపాల్, అంబటి శ్రీనివాస్,ఉప్పులూటి గణేష్, చెప్యాల గణేష్, పున్నూరి శ్రీనివాస్, లావుడ్య సతీష్, నాయకులు,గడ్డం శ్రీనివాస్,అక్కినపెల్లి శ్రీనివాస్,దాసరి గంగరాజం,చెలుకల శ్రీకాంత్, ఆకుల గగన్, తదితరులు పాల్గొన్నారు....