బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులుగా లక్ష్మారెడ్డి
09-10-2026 | 10:16pm
కోహెడ, అక్టోబర్ 9 (విజయక్రాంతి): బిజెపి కిసాన్ మోర్చా(BJP Kisan Morcha) మండల అధ్యక్షునిగా వింజపల్లి కి చెందిన అన్నాడి లక్ష్మారెడ్డి(Annadi Lakshma Reddy) నియమితులైయారు. ఈ సందర్బంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తమ నియమానికి సహకరించిన.. బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం, మండల అధ్యక్షులు జాలిగాం రమేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ సారథ్యంలో కోహెడ మండలంలోని రైతు సమస్యలపై పోరాటం చేస్తూ.. భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తా అన్నారు.