బతుకమ్మ వేడుకలలో ఆకట్టుకున్న నవ దుర్గల వేషధారణ

09-10-2026 | 10:35pm

బోథ్. అక్టోబర్ 9 (విజయక్రాంతి): మండల కేంద్రంలో ని వేదం పాఠశాలలు(Veda schools) విద్యార్థులు బతుకమ్మ పండుగ(Bathukamma Festival) సందర్భంగా ఎత్తుకొని జానపద గీతాలు ఆలపిస్తూ సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు బతుకమ్మ పాటలు(Bathukamma Songs) పాడి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులు నవదురుగాల వేషధారణలో శైలపుత్రి, బ్రహ్మచారిని, చంద్రమండ ,స్కంద మాత, కాత్యాయని కాలరాత్రి ,మహా గౌరీ ,సిద్ది ధాత్రి ,అవతారాలలో విద్యార్థులు కనిపించారు

, దుర్గామాత ను కనులకు పట్టినట్టు కనిపించే విధంగా  చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంతోష్ మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు పువ్వుల పండుగ జరుపుకోవడం జరుగుతుందన్నారు. బతుకమ్మ తమ పుట్టింటి ఆడబిడ్డగా కొలుస్తూనే నవ దుర్గల ను స్మరిస్తారన్నారు. భావితరాలకు సాటి చెప్పే విధంగా పండుగను ప్రతిఏటా జరపడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు