అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు

09-10-2026 | 10:33pm

 ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను(Welfare schemes) అందిస్తామని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(Bellampalli MLA Gaddam Vinod) అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బెల్లంపల్లి మండలం, బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, స్మార్ట్ రేషన్ కార్డులు(Smart Ration Cards), మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా శక్తి పథకం(Mahila Shakti Scheme) కింద కుట్టు మిషన్లను ఎమ్మెల్యే  గడ్డం వినోద్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. 

పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, మైనార్టీల సంక్షేమానికి కృషి చేయడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. 42 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, మొత్తం రూ.42 లక్షలు రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. 

అలాగే 23,975 స్మార్ట్ రేషన్ కార్డులు, మహిళా శక్తి పథకం కింద 178 కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ నీరేటి రాజేశ్వరి, బెల్లంపల్లి తహసీల్దార్ ఎల్. కృష్ణ, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ దావస్వాతి, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్,  కౌన్సిలర్లు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు