సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ కు ఘనస్వాగతం
కొత్తపల్లి, అక్టోబర్ 09 (విజయక్రాంతి): ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(All India Majlis-e-Ittehadul Muslimeen) ఏఐఎంఐఎం పార్టీ(AIMIM party) కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గా సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్(Syed Ghulam Ahmed Hussain) ను, పార్టీ అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) నియామకం(Appointment) చేసినట్లు ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ కు, హైదరాబాద్ దారుస్సలాంలో నియామకపు ఉత్తర్వులను బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ అందజేశారు. గ్రూపు రాజకీయాలను, వర్గ విభేదాలను పక్కన బెట్టి ఎంఐఎం బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, కరీంనగర్ జిల్లా, పట్టణ కమిటీకి దిశానిర్దేశం చేశారు.
కలిసి కట్టుగా ఉండి పార్టీని పటిష్టపరిచేందుకు కృషి చేయాలని కోరారు. తనపై గురుతరమైనటువంటి బాధ్యతతో కరీంనగర్ సిరిసిల్ల పెద్దపల్లి జిల్లాల అధ్యక్షుడిగా నియమించిన ఎంఐఎం అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీకి గులాం అహ్మద్ హుస్సేన్ కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ పెద్దపల్లి సిరిసిల్ల జిల్లాల్లో పార్టీ అభివృద్ధి కోసం తన శాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి, మొదటిసారి కరీంనగర్ కు విచ్చేసిన గులాం అహ్మద్ హుస్సేన్ కు పార్టీ శ్రేణులు, యూత్ అలుగునూర్ చౌరస్తా వద్ద పూలమాలలు, శాలువాలతో ఘనస్వాగతం పలికారు. వందల వాహనాలతో కరీంనగర్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయం దారుస్సలాం వద్ద భారీ ఎత్తున టపాసులు కాల్చి, స్వీట్లు పంచారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.