రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఐపీఎస్‌ విద్యార్థులు

09-10-2026 | 10:30pm

సుల్తానాబాద్‌, అక్టోబర్ 9: (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ పట్టణంలోని  ఇండియన్‌ పబ్లిక్‌ పాఠశాల(Indian Public School) (ఐపీఎస్‌) విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు(State level athletics competitions) ఎంపికయ్యారు. 10 ఏళ్ల బాలుర విభాగంలో జె శ్రేయన్‌ గౌడ్‌ 60 మీటర్ల పరుగు పందెం, బి. మహంత్‌ కృష్ణ లాంగ్‌ జంప్‌లో జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచి ఈ నెల 11న ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.

విద్యార్థుల ఎంపిక పట్ల పాఠశాల చైర్మన్‌ మాటేటి సంజీవ్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ మాటేటి కృష్ణప్రియ హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన కోచ్‌ సత్యనారాయణను ప్రశంసించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల్లో మరింత రాణించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ సునీత, మేనేజర్‌ శివ, వ్యాయామ  ఉపాధ్యాయులు సతీష్‌, జ్యోతి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు