వేదవ్యాస పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు
వెంకటాపూర్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని వేదవ్యాస ఉన్నత పాఠశాల ప్రధానాచార్యులు పోశాల వీరమల్లు అన్నారు. మండల కేంద్రంలోని వేదవ్యాస ఉన్నత పాఠశాలలో(Vedavyasa High School) శుక్రవారం ముందస్తు బతుకమ్మ సంబరాలను(Bathukamma celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ సందర్భంగా వీరమల్లు మాట్లాడుతూ.. ప్రకృతిని ఆరాధిస్తూ రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి జరుపుకునే ఈ పండుగ మహిళల ఐక్యతకు, ప్రకృతి ప్రేమకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
విద్యార్థులు తమ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ వాటి గొప్పతనాన్ని భావితరాలకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య ప్రతినిధులు సూర్యప్రకాష్, రాజయ్య, ఉపాధ్యాయులు హనుమంతు, భవాని, మాలతి, రామ్మోహన్, కృష్ణవేణి, అక్షిత, సుజాత, అనూష, రమ తదితరులు పాల్గొన్నారు.