చలో హైదరాబాదుకు తరలి వెళ్లిన మున్సిపల్ కార్మికులు
సుల్తానాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): సిఐటియు(CITU) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాదు ఇందిరా పార్క్ వద్ద జరిగే మహా ధర్నాకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్మికులు(Municipal Workers) తరళి వెళుతున్న వాహనాలను సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తాండ్ర అంజయ్య జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, కనీస వేతనం 42 వేల రూపాయలు ఇవ్వాలని, పని భద్రత, సామాజిక భద్రత కల్పించాలని, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని తదితర డిమాండ్లతో ఈ మహా ధర్నా జరుగుతుందని పెద్ద ఎత్తున కార్యక్రమంలో మున్సిపల్ సంఘం జిల్లా అధ్యక్షులు పాక మహేష్ మున్సిపల్ సంఘం అధ్యక్షులు న్యాతరి రమేష్, ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి సురేష్, లక్ష్మి, కలవల శీను, కొమ్మ గళ్ళ బాబు, సది, రాములు, రామ్మూర్తి, లక్ష్మణ్, అనిల్, కుమార్, సత్యం, మహంకాళి మల్లేష్, గంగవ్వ, సునీత, ఓదెలు, రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు వీరగోని కిరణ్ గౌడ్ పెద్ద ఎత్తున కార్మికులు తరలి వెళ్లారు..