చిన్నకల్వల సహకార సంఘాన్ని సందర్శించిన డీసీసీబీ అధికారులు
సుల్తానాబాద్ , అక్టోబర్ 22 (విజయక్రాంతి): సహకార కేంద్ర బ్యాంక్ ( డీసీసీబీ)(District Cooperative Central Bank) అసిస్టెంట్ జనరల్ మేనేజర్, అధికారులు, సిబ్బంది చిన్నకల్వల సహకార సంఘాన్ని గురువారం సందర్శించి, సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాపారాలు, రుణాల పంపిణీని పరిశీలించారు. పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, చిరు వ్యాపారులకు రుణాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయాలు, గోదాములు, పెట్రోల్ పంపు నిర్వహణ తీరును సమీక్షించారు. సంఘం కార్యకలాపాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పీఏసీఎస్ డెవలప్‌మెంట్ రిసోర్స్ పర్సన్ సత్యనారాయణ, సింగిల్ విండో అధ్యక్షుడు గౌరవెల్లి మురళీధర్ రావు కార్యదర్శి వల్లకొండ రమేష్ సంఘం వివరాలను అధికారులకు వివరించారు. డీసీసీబీ సహకారంతో భవిష్యత్తులో ఫంక్షన్ హాల్ నిర్మాణం, బంగారు రుణాల పంపిణీ ప్రారంభించేందుకు ప్రణాళికలురూపొందిస్తున్నట్లు సంఘం గౌరవ అధ్యక్షుడు గౌరవెల్లి మురళీధర్‌రావు తెలిపారు.