మెడిసిన్ సీటు సాధించిన ఎస్ ఎఫ్ ఐ మాజీ మండల అధ్యక్షుడు

22-10-2026 | 09:40pm

ముదిగొండ, విజయక్రాంతి :అక్టోబర్ 22: మండల కేంద్రం లోని ఎస్ఎఫ్ఐ మండల మాజీ అధ్యక్షుడు పందిరి ఆనంద్ ను(Former SFI Leader Anand) ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు(DYFI leaders) శాలువాలతో సన్మానించి, స్వీట్లు తినిపించి  అభినందించారు.ముదిగొండ మండల కేంద్రంలో యువజన నాయకుడిగా ఎస్ఎఫ్ఐ లో పని చేస్తూ  విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేస్తూ, జీవితం లో ఎంచుకున్న లక్ష్యా ని నిర్లక్ష్యం చెయ్యకుండా,

చదువు పై మమకారాన్ని తగ్గించకుండా నీట్ పరీక్షల్లో ర్యాంకు సాధించి ఎంబిబిఎస్ సీట్ సాధించిన పందిరి  ఆనంద్ ను పలువురు అభినందించారు. ముదిగొండ గ్రామం నుంచి ఎంబిబిఎస్ సీట్ సాధించడం పట్ల  హార్షం  వ్యక్తం చేస్తూ ఆనంద్ తో పాటు  తన విజయానికి పూర్తి సహకారం అందించిన వారి తల్లిదండ్రులు మల్లికార్జున్, లక్ష్మీ లను కూడా యువజన నాయకులు సన్మానించారు.

ఆనంద్ ముదిగొండ గ్రామ విద్యార్థి లోకానికి ఆదర్శంగా నిలుస్తారని ఈ సందర్భంగా యువజన నాయకులు కొనియాడారు ఈ కార్యక్రమంలో బట్టు రాజు జాన్ పాషా కాటం రాజు కాంచాని రవి పుచ్చకాయల సురేష్ రేఖ వీరబాబు భాష అక్షయ్ మహేష్ నాగరాజు సుభాష్ సాయి వెంకటేష్ గోపి వినయ్ రోహిత్ రామకృష్ణ యుగంధర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు