బంగాళాఖాతంలో అల్పపీడనం..తెలుగు రాష్ట్రాలకు వర్ష గండం

22-10-2026 | 05:03pm

బంగాళాఖాతంలో అక్టోబర్ 23 నాటికి అల్పపీడనం (Low Pressure) ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులు (Strong Winds) వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కాకినాడ, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరోవైపు తెలంగాణలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


మరిన్ని వార్తలు