గోడ కూలి ఐదేళ్ల చిన్నారి మృతి

22-10-2026 | 09:31pm

బోధన్ ఆర్టీసీ కాలనీలో విషాదం

బోధన్, అక్టోబర్ 22 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో(RTC Colony) గురువారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటి గోడ కూలిపోవడంతో ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆర్టీసీ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ఫిరోజ్ ఖాన్ కుమార్తెపై ఇంటి సజ్జ గోడ కూలిపడింది.

ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందినట్లు తెలిపారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు బోధన్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పంచనామా నిర్వహించినట్లు పట్టణ సీఐ వెంకట నారాయణ వెల్లడించారు.

మరిన్ని వార్తలు