రక్తదానం చేయండి… ప్రాణదాతలు కండి!

22-10-2026 | 09:37pm

ఈనెల 28న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి పిలుపు

కూసుమంచి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 28వ తేదీ, బుధవారం నాడు కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని(Blood Donation Camp) నిర్వహించనున్నట్లు కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి తెలిపారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలిచి, వారికి అవసరమైన రక్తాన్ని అందించాలనే సంకల్పంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానానికి ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువత, అభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని బజ్జూరి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు