వెంకన్న ఆలయ పనులపై సీఎం ఫోకస్!

22-10-2026 | 05:12pm

వికారాబాద్, అక్టోబర్ 22(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని ప్రసిద్ధ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (A. Revanth Reddy) పరిశీలించారు. పేదల తిరుపతిగా పేరొందిన ఈ ఆలయాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దేందుకు పనులు కొనసాగుతున్నాయి.

ఆలయ పునర్నిర్మాణ పనుల (Temple Renovation) పురోగతిని పరిశీలించిన ముఖ్యమంత్రి, పనుల నాణ్యత, ఆలయ అభివృద్ధికి సంబంధించి అధికారులకు (Officials) పలు సూచనలు చేశారు. ఆలయాన్ని భక్తులకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు.

అంతకుముందు ముఖ్యమంత్రి బాలాలయంలో (Balaalayam) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు