పాదయాత్రగా శబరిమలై బయలుదేరిన అయ్యప్ప మాలాదారులు

22-10-2026 | 09:22pm

ఘట్ కేసర్, అక్టోబర్ 22 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణం శివారెడ్డిగూడలోని శ్రీమల్లిఖార్జున ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో(Sri Mallikarjuna Prasannanjaneya Swamy Temple) ఇరుముడి కట్టుకున్న పలువురు అయ్యప్ప మాలాదారులు గురువారం  పాదయాత్రగా శబరిమలైలోని శ్రీఅయ్యప్పస్వామి ఆలయానికి స్వామి వారి దర్శనానికై బయలుదేరారు.

మొదట నగరంలోని కర్మన్ ఘాట్ వెళ్లి అక్కడి నుండి ఇతర అయ్యప్ప మాలాదారులతో కలిసి శబరిమలైకు పాదయాత్రగా బయలుదేరుతారు. పాదయాత్రలో అయ్యప్పమాల ధరించిన  మేకల ఓంఆదిత్య గురుస్వామి, మాలాదారులు పడిగం అజయ్, పడిగం యశ్వంత్, పర్నాటి సాయి తేజ, ఇతర మాలాదారులు వెళ్లగా వారిని ఎడ్ల అనిల్ కుమార్, పడిగం ప్రవీణ్ కుమార్, కొంతం నరసింహారెడ్డి, లంబ శ్రీనివాస్ యాదవ్ కలిశారు.

మరిన్ని వార్తలు