గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

22-10-2026 | 09:19pm

జిన్నారం, అక్టోబర్ 22: గడ్డపోతారం మున్సిపాలిటీ (Gaddapotharam Municipality)పరిధిలోని వావిలాల గ్రామ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలి వయస్సు సుమారు 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, మృతురాలి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

మృతురాలిని ఎవరైనా గుర్తించినట్లయితే లేదా ఆమెకు సంబంధించిన వివరాలు తెలిసినట్లయితే వెంటనే జిన్నారం పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్, జిన్నారం ఎస్‌హెచ్‌ఓ 8712656750 మృతురాలి గుర్తింపు కోసం ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు