సుల్తానాబాద్ శ్రీవాణి కళాశాలలో బతుకమ్మ సంబరాలు

09-10-2026 | 10:59pm

సుల్తానాబాద్ , అక్టోబర్ 09 (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని(Sultanabad town)  శ్రీవాణి జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు(Bathukamma Celebrations) అంగరంగ వైభవంగా జరిగాయి. విద్యార్థులు(Students) పూలతో ఆకర్షణీయమైన బతుకమ్మలు వివిధ రూపాలలో  తయారుచేసి బతుకమ్మ ఆడడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన   కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక  మాట్లాడుతూ ఈ తరం  విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియపరచడం ముఖ్యమని అన్నారు,

  దేవతలను పూలతో పూజిస్తే పూలనే దేవతగా పూజించే పండగ మన బతుకమ్మ అని తెలపడం జరిగింది. విద్యార్థులందరికీ గౌరమ్మ ఆశీస్సులు ఉండి చక్కని విద్యను అభ్యసించాలని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా  బతుకమ్మలను ఆకర్షణీయంగా తయారు చేసుకుని వచ్చిన విద్యార్థులకు బహుమతులు  ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ బండారి కమలాకర్ , బాలసాని శ్రీనివాస్, అధ్యాపక బృందం మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు