ఉషు పోటీల్లో పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థుల ప్రతిభ

27-09-2026 | 04:50pm

బోధన్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఉషు క్రీడా పోటీ(Wushu Competitions)ల్లో పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. 17 సంవత్సరాల విభాగంలో తడపు అఖిల్, శివమ్, మీనాక్షి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. వీరు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా సింధూబాయి, గంగోత్రి వెండి పతకాలు సాధించగా, సునీత, మౌనిక, శాలీం రాజ్ కాంస్య పతకాలు సాధించి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు.

పోటీల్లో విద్యార్థులు క్రమశిక్షణతో, ఉత్సాహంతో పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. విజయం సాధించిన విద్యార్థులను పాఠశాల హెచ్‌ఎం సూర్యకుమార్, పీడీ సునీత, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు మరింతగా సాధన చేసి మంచి ఫలితాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. విద్యార్థుల విజయంతో పాఠశాలలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు