లక్కీ డ్రాలో ప్రధాని మోదీకి బహుమతి..!

26-10-2026 | 07:30pm

కోటగిరి సార్వజనిక్ ఉత్సవ కమిటీ లక్కీ డ్రాలో ఆసక్తికర ఘటన..

ఈ ఘటన ఆలస్యంగా విజయక్రాంతి దృశ్యంలోకి వచ్చింది.

బోధన్,(విజయక్రాంతి): కోటగిరి మండల కేంద్రంలోని సార్వజనిక్ దేవి ఉత్సవ కమిటీ(Sarvajanik Devi Utsav Committee) ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో రాసిన చీటీకి బహుమతి లభించడం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. కోటగిరిలో తొమ్మిది రోజులపాటు నిర్వహించిన శరన్నవరాత్రి రజతోత్సవాలు(Sharannavaratri festival) ముగిసిన అనంతరం బుధవారం దుర్గామాత శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించి విజేతలను ప్రకటించారు. ఈ డ్రాలో ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో రాసిన చీటీకి బహుమతి వరించింది. కోటగిరి మండల బీజేపీ అధ్యక్షుడు ఏముల నవీన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో లక్కీ డ్రా చీటీ రాసినట్లు తెలిసింది. ఆ చీటీకి బహుమతి రావడంతో ఉత్సవాల్లో పాల్గొన్నవారిలో ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ పేరుతో రాసిన చీటీకి బహుమతి లభించడం ఈ లక్కీ డ్రాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఘటన ఆలస్యంగా విజయక్రాంతి దృశ్యంలోకి వచ్చింది.

మరిన్ని వార్తలు