పసుపు క్వింటాలుకు రూ.50 వేల ధర సాధిస్తా
బాండ్ పేపర్‌పై హామీ ఇచ్చేందుకూ సిద్ధం: ఎంపీ అరవింద్
బోధన్,(విజయక్రాంతి): పసుపు రైతుల(Turmeric farmers)కు క్వింటాలుకు రూ.50 వేల ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే బాండ్ పేపర్‌పై హామీ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ఎంపీ ధర్మపురి అరవింద్(MP Dharmapuri Arvind) పేర్కొన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, గతంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పసుపునకు క్వింటాలుకు రూ.50 వేల ధర సాధించి చూపిస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు.
పసుపు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు తాను కట్టుబడి ఉన్నానని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. పసుపు సాగుపై ఆధారపడి జీవిస్తున్న రైతుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తన హామీని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు.