మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం

27-09-2026 | 04:49pm

బోధన్, సెప్టెంబర్ 27 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలో మిషన్ భగీరథ(Mission Bhagiratha) నీటి సరఫరా జరగకపోవడంతో రేపు బోధన్ పాత పట్టణం, వీరేశ్‌లింగం పార్క్ ప్రాంతాలకు సంబంధించిన వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా ఉండదని బోధన్ మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నీటి సరఫరా అంతరాయం కారణంగా 15, 16, 17, 18, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 36, 37, 38వ వార్డుల ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు పరిస్థితిని గమనించి, ముందస్తుగా అవసరమైన నీటిని సమకూర్చుకోవాలని మున్సిపల్ అధికారులు సూచించారు. ప్రజలకు కలిగే అసౌకర్యానికి సహకరించాలని కోరారు.


మరిన్ని వార్తలు