భగత్‌సింగ్‌ ఆశయాలతో యువత ప్రజా ఉద్యమాలు

27-09-2026 | 06:36pm

- డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కాళంగి హరికృష్ణ

ఇల్లెందు, (విజయక్రాంతి): భగత్‌సింగ్‌(Bhagat Singh) స్ఫూర్తితో యువత ప్రజా సమస్యలపై(Public issues) పోరాటాల్లో భాగస్వాములు కావాలని డీవైఎఫ్‌ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాళంగి హరికృష్ణ(DYFI Bhadradri Kothagudem District Secretary Kalangi Harikrishna) పిలుపునిచ్చారు. ఆదివారం ఇల్లెందు పట్టణ డీవైఎఫ్‌ఐ కమిటీ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ జయంతి వేడుకలు(Bhagat Singh Birth Anniversary Celebrations) నిర్వహించారు. భగత్‌సింగ్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ నిరుద్యోగం(Unemployment), విద్య, పెరుగుతున్న జీవన వ్యయాలు, ఆర్థిక అసమానతలపై యువత గళమెత్తాలన్నారు.

శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించుకుని మూఢనమ్మకాలు, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా నిలవాలని సూచించారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమాల్లో యువత భాగస్వాములు కావడమే భగత్‌సింగ్‌కు నిజమైన నివాళి అని అన్నారు.

కార్యక్రమంలో ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి సయ్యద్‌ అబ్దుల్‌ నబీ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఆలేటి కిరణ్‌, సీఐటీయూ జిల్లా నాయకులు తాళ్లూరి కృష్ణ, కేవీపీఎస్‌ జిల్లా నాయకులు మోహన్‌రావు, డీవైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి బబ్లు, నాయకులు రమేష్‌, సర్వన్‌, మహేష్‌, కమిటీ సభ్యులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు