నవంబర్ లో ఆన్ లైన్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలీ
- సీపీఆర్ఎంఎస్ సేవలు పునరుద్దరించుకోవాలి
- జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, (విజయక్రాంతి ): మంచిర్యాల జిల్లాలోని సింగరేణి రిటైర్డ్ కార్మికులు(Retired Singareni workers) నవంబర్ నెలలో ఆన్ లైన్ లైఫ్ సర్టిఫికెట్(Online life certificate) సమర్పించి, సీపీఆర్ఎంఎస్ సేవలు పునరుద్దరించుకోవాలని శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్ శుక్ర వారం కోరారు. విశ్రాంత ఉద్యోగులకు సైతం కార్పోరేట్ వైద్యసేవల కల్పనలో భాగంగా సింగరేణి సంస్థ(Singareni Company) సీపీఆర్ఎంఎస్ సేవలు అందుబాటులోకి తెచ్చిందన్నారు.
ఇప్పటికే వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు ఈ సేవలు పొందుతున్నారని, ప్రతీ యేటా నవంబర్ నెలలో సీపీఆర్ఎంఎస్ కార్డులు రెన్యువల్ చేసుకోవటం తప్పని సరి అని, ఈ నెలలోనే ఆన్ లైన్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పిస్తేనే సీపీఆర్ఎంఎస్ సేవలు పొందేందుకు అర్హులన్నారు.
ఇందుకోసం విశ్రాంత ఉద్యోగి , అతని భార్య, మీసేవ ద్వారా లేదా మొబైల్లో జీవన్ ప్రమాణ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ లో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించి నిరాటంక వైద్యసేవలు పొందాలని కోరారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటి వరకు దాదాపుగా 10 వేల మంది విశ్రాంత ఉద్యోగులకు సీపీఆర్ఎంఎస్ కార్డులు మంజూరు చేశామన్నారు. ఈ కార్డులు పొందిన ప్రతీ ఒక్క విశ్రాంత ఉద్యోగి తప్పనిసరిగా రెన్యువల్ చేసుకొని సింగరేణి సంస్థ కల్పిస్తోన్న కార్పోరేట్ స్థాయి ఉచిత వైద్య సేవలను నిరాటంకంగా పొందాలని కోరారు.