ఆరుతడి పంటలను రైతులు సాగు చేయాలి

30-10-2026 | 07:15pm

El-nino ప్రభావం, స్వల్పకాలిక ఆరుతడి పంటలను రైతులు సాగు చేయాలి

వెంకటాపురంమండల వ్యవసాయ అధికారి నవీన్

వెంకటాపురం నూగూరు,(విజయక్రాంతి): El-nino ప్రభావం(El-Nino effects), స్వల్పకాలిక ఆరుతడి పంటల సాగు(Grow Short-Term Crops) చేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారి నవీన్ అన్నారు క్షేత్రస్థాయిలో రైతులకు వివరించడానికి మండల వ్యవసాయ అధికారి నవీన్(Agricultural Officer Naveen) మండలంలో మరికాల లక్ష్మీపురం గ్రామాలలో పర్యటించడం జరిగింది.ప్రస్తుతం యాసంగిలో రైతులు తక్కువ నీటితో, తక్కువ సమయంలో పండే పెసలు, మినుములు, వేరుశెనగ వంటి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు.

ఇటీవల కాలంలో వ్యవసాయ శాఖ వరుస సమావేశాలు  పత్రికా ప్రకటనలతో రైతులకు El-nino, వర్షాభావ పరిస్థితులు మీద అవగాహన కనిపిస్తున్నప్పటికీ కొంతమంది రైతులు నీటి అవసరం ఎక్కువగా ఉంది మొక్కజొన్న పంట సాగుకి సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది. అందువల్ల సంబంధిత గ్రామాలైన మరి కాల, బెస్త గూడెం, లక్ష్మీపురంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులు ఒకవేళ ఈ యాసంగిలో వరి, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేస్తే వాటికి చివరి పంటదశ వరకు నీరు అందే పరిస్థితి లేదని వివరించారు.

అయినా కూడా రైతులు మొక్కజొన్న, వరి వంటి పంటలు వేసి వాటి దిగుబడి , కొనుగోలు విషయంలో ఇబ్బందులు ఎదురైతే రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని  స్పష్టం చేశారు. కావున రైతు సోదరులు దయచేసి ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ కురుసంకన్నయ్య,  రైతులు, ఏవోలు పాల్గొనడం జరిగింది

మరిన్ని వార్తలు