మండల స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలు
మూసాపేట్,(విజయక్రాంతి): మూసాపేట్ మండల కేంద్రంలోని మండల స్థాయి దివ్యాంగ విద్యార్థుల క్రీడా పోటీలు శుక్రవారం మండల కేంద్రంలో క్రీడా ప్రాంగణంలో దివ్యాంగ విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాగంగా పరుగు పందెం , లెమన్ అండ్ స్పూన్, మ్యుజికల్ చేయిర్స్, జిగ్ జాగ్ రన్ మొదలగు పోటిల్లో విద్యార్థులు ప్రతిభ చాటారు. దివ్యాంగ విద్యార్థులకు క్రీడా పోటీలను సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగుల హక్కులు, వారికి ఉన్న ఆత్మ స్థైర్యం , సమాన అవకాశాలు, వారు ఎదుర్కొంటున్న సవాళ్లపై వివరణాత్మకంగా MEO నాగయ్య గారు చెప్పడం జరిగింది విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేసి అభినందించారు.