సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

21-09-2026 | 05:47pm

నిర్మల్ సెప్టెంబర్ 21 ( విజయ క్రాంతి): నిర్మల్, పట్టణంతో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Nirmal MLA Eleti Maheshwar Reddy) సోమవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకోవాల్సి వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఊరటనిస్తోందన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోను మండల అధ్యక్షుడు గంగారెడ్డి,  వివిధ మండలాల బీజేపీ అధ్యక్షులు, పట్టణ కౌన్సిలర్ లు పార్టీ నాయకులు, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు