ప్రజావాణిలో రెండే.. రెండు దరఖాస్తులు
21-09-2026 | 07:04pm
బెల,(విజయక్రాంతి): బెల మండల(Bela Mandal) కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి(Prajavani) ఇందిరమ్మ ఇళ్ల, విద్య శాఖకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు నోడల్ అధికారి ఎంపీడీవో మహేష్ కుమార్(Nodal Officer MPDO Mahesh Kumar) తెలిపారు. 12 శాఖల అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారన్నారు. ప్రజలు ప్రతి వారం ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు తాసిల్దార్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.