గ్రామ పంచాయతీ వర్కర్ల పెండింగ్ వేతనాలు ఇవ్వాలి

21-09-2026 | 07:19pm

మునిప‌ల్లి సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ వ‌ర్క‌ర్ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ఆ యూనియ‌న్ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం మండ‌ల కేంద్ర‌మైన మునిప‌ల్లి ఎంపీడీఓ కార్యాల‌యంలో నిర్వ‌హించిన ప్ర‌జావాణిలో అధికారుల‌కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా యూనియ‌న్ మండ‌ల అధ్య‌క్షుడు ఇమ్మానియేల్(Union Mandal President Emmanuel) మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ వర్కర్లకు గత మూడు నాలుగు నెలల నుండి వేతనాలు ఇవ్వక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అలాగే  వేత‌నాల‌ను  వెంటనే మంజూరు చేయాలని ఆయ‌న ప్రభుత్వాన్ని విజ్ఞ‌ప్తి చేశారు. విన‌తి ప‌త్రం ఇచ్చిన వారిలో గ్రామపంచాయతీ  వ‌ర్క‌ర్లు బి రవి, యాదయ్య, నరసింహులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు