ఒక్క చుక్క నీళ్లొస్తలేవ్.. జూరాల నీటి ఎద్దడి వాస్తవం!

21-09-2026 | 01:37pm

సాగుకు నీళ్లిస్తే.. తాగునీటి పరిస్థితి ఏంటి?

హైదరాబాద్: నీటి ప్రాజెక్టుల్లోకి ఒక్క చుక్క నీరు కూడా రావట్లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. సాగుకు నీరు వదిలేస్తే.. తాగు నీటి పరిస్థితి ఏంటి? అని మంత్రి ప్రశ్నించారు. జూరాల వద్ద ఎందుకు అదనంగా రిజర్వాయర్ నిర్మాణం ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం(Kaleshwaram Project) నుంచి ఎర్రవల్లికి నీళ్లు వస్తున్నాయన్న మంత్రి జూపల్లి జూరాల వద్ద 21 టీఎంసీల గట్టు నిర్మిస్తామన్నారు.. ఒక్క టీఎంసీ గట్టు కూడా నిర్మించలేదని మండిపడ్డారు.

జూరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేకపోవడానికి కారణం బీఆర్ఎస్సేనని ఆరోపించారు. పదేళ్ల పాలనలో కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ఒక్క రిజర్వాయర్ కూడా నిర్మించలేదని విమర్శించారు. ఆరోజు  రిజర్వాయర్ నిర్మించి ఉంటే ఈనాడు ఇబ్బంది ఉండేది కాదన్నారు. జూరాల ఆయకట్టుకు నీటి ఎద్దడి ఉన్నది వాస్తవమని మంత్రి స్పష్టం చేశారు. ఎల్ నినో(El Niño) వల్ల ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు చెప్పినట్లు మంత్రి గుర్తుచేశారు. నీటి విడుదల కోసం కర్ణాటక ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నామని సూచించారు. కృష్ణా జలాలను(Krishna waters) ఏపీ ఎక్కువగా వాడుకుంటుందని కేసీఆర్ అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణా జలాలను ఏపీ ఎక్కువగా వాడుకుందని జూపల్లి ఆరోపించారు.  

ఇరిగేషన్ పై అవగాహన ఉండే కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) మాట్లాడుతున్నారా? ఐదు మోటర్లు ఉంటే మూడే నడిపించారని ఆరోపించారు. రైతులకు 6 గంటలకు మించి కరెంట్ ఇవ్వట్లేదని మాట్లాడుతున్నారని, గతంలో లాగ్ బుక్ లు కూడా చూడనివ్వలేదని ఎద్దేవా చేశారు. డిసెంబర్ లో 19,542 మెగా వాట్ల విద్యుత్ వినియోగం జరిగిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 15 వేల మెగా వాట్లే విద్యుత్ ఉపయోగించారని వివరించారు. విద్యుత్ సంస్థలపై రూ. లక్ష కోట్ల బకాయిలు ఉన్నాయని జూపల్లి లెక్కచెప్పారు.



మరిన్ని వార్తలు