ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ సెప్టెంబర్ 21 ( విజయ క్రాంతి): నిర్మల్ పట్టణంలోని బంగల్‌పేట్ వినాయక సాగర్‌ను సోమవారం మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ అప్పాల గణేష్ చక్రవర్తి గారు కౌన్సిలర్లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్(Municipal) ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా కొనసాగుతున్న పనులను పరిశీలించారు.
వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. సాగర్ పరిసరాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్, భద్రత తదితర ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్పీ రాజు, కత్తి నరేందర్, పెండం శ్రీనివాస్, శ్రీ రామోజు నరేష్, అడప పోశెట్టి, లక్కాకుల హరీష్, కొండాజీ రాఘవేంద్ర చారి, ఆకుల రామకృష్ణ, నాందేడపు చిన్ను,మాజీ కౌన్సిలర్ తోట నర్సయ్య, నాయకులు వంశీ, మున్సిపల్ కమీషనర్ యం. రవి కుమార్, DE హరిభువన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.