ఎర్రవల్లిలో కొనసాగుతున్న భూముల సర్వే.. విడతల వారీగా నోటీసులు?

21-09-2026 | 01:09pm

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా కేసీఆర్ ఫామ్ హౌస్(KCR's farmhouse) పరిసరాల్లో రైతుల పొలాల వద్ద రెవెన్యూ అధికారుల సర్వే(Erravalli Land Survey) కొనసాగుతోంది. సర్వే నంబర్ 325లో రైతుల వారీగా అధికారులు భూముల సర్వే చేస్తున్నారు. శనివారం నోటీసులు అందుకున్న రైతల పొలాల సర్వే చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు అధికారులకు పొలాల హద్దులు చూపిస్తున్నారు. రైతుల సమక్షంలో భూముల హద్దులు, విస్తీర్ణాన్ని సర్వే సిబ్బంది పరిశీలిస్తున్నారు.

భూమికి సంబంధించిన వివరాలను రైతుల వారీగా అధికారులు నమోదు చేస్తున్నారు. సర్వే నంబర్ 325లో(Survey Number 325) వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు విడతల వారీగా నోటీసులు ఇస్తున్నారు. నాలుగు విడతల్లో సర్వే చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రైతుల సహకారంతో ప్రశాంత వాతావరణంలో సర్వే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30 రోజుల్లో భూముల సర్వే చేపట్టి రిపోర్టు ఇవ్వాలని రెవెన్యూ శాఖ ఆదేశించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు