ఉద్యమ కారులకు దక్కనున్న గౌరవం

21-09-2026 | 07:01pm

జిల్లా అధ్యక్షులు  గుండె పంగు రమేష్ 

మోతె, సెప్టెంబర్21 (విజయ క్రాంతి):-తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పని చేసిన ఉద్యమ కారులందరికి గౌరవం దక్కనున్నట్లు తెలంగాణ ఉద్యమ కారుల పోరం(Telangana Activists' Forum) జిల్లా అధ్యక్షులు గుండె పంగు రమేష్(District President Gunde Pangu Ramesh) అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, 1969 తొలి 2001  మలి దశ తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్ళు నిధులు నియామకాలు అనే అంశంతో ఆత్మ గౌరవ పోరాటంలో అలుపెరుగనిపోరాటం సాగించి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగిందని చెప్పారు. గత బి ఆర్ యస్ ప్రభుత్వం ఉద్యమ కారులను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నాటి నుండి నేటి వరకు ఉద్యమ కారులను పట్టించుకోలేదని మండిపడ్డారు ఈ మధ్యకాలంలో కేక కమిటీ వేసి 250 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు ఉద్యమకారుల వివరాలను సేకరించడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. ఉద్యమ కాలంలో పనిచేసి అమరులైన కొందరు జైలుకుపోయిన మరి కొందరు బైండోవరైన కొందరు  వికలాంగులైన వారు కొందరు జెండాలు పట్టుకొని ఉద్యమంలో భాగస్వామ్యమైన ప్రతి కార్యకర్తకు ఉద్యమ ఫలాలు అందించాలని డిమాండ్ చేశారు.

ప్రతి కార్యకర్తకు తెలంగాణ ఉద్యమ కారులుగా గుర్తించి నెలకు 25 వేల పెన్షన్, ఉచిత వైద్యము, ఉచిత బస్సు సౌకర్యం అందించాలని కోరారు. ఉద్యమకారులందరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల కమిటీని ఎన్నుకొని నియామక పత్రం అందించారు. ఈనెల 27 న యాదగిరి గుట్టలో జరిగే ఉద్యమ కారుల సదస్సు కృతజ్ఞత సభ కు వేలాదిగా తరలి వచ్చి  జయప్రదం చేయాలని తెలిపారు.

గౌరవ అధ్యక్షులుగా ఉన్నాం సత్యనారాయణ రావు,  మండల అధ్యక్షులుగా వీరండి నారాయణ, ఉపాధ్యక్షులుగా ఇట్ట మల్ల ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా పల్లెల రాము, సహాయ కార్యదర్శిగా మైనంపాటి ప్రభాకర్ రెడ్డి,  గౌరవ సలహాదారులుగా సురకంటి లింగారెడ్డి, హనుమకొండ సేనా రెడ్డి, బొక్క వీరారెడ్డి లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరంనియోజకవర్గం నాయకులు ఏనుగుల ఎల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు