విద్యార్థులకు అవగాహన సదస్సు

21-09-2026 | 07:06pm

నిర్మల్ సెప్టెంబర్ 21 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాసవి యాజమాన్యం(Vasavi Management) ఆధ్వర్యంలో  విద్యార్థులకు భవిష్యత్ కార్యచరణపై ప్రముఖ వైద్యులు సురేష్ అల్లాడి(Renowned doctor Suresh Alladi) , సుధీర్ సండ్ర సైకాలజిస్టు విద్యార్థులకు స్కిల్ పై అవగాహన కల్పించారు. విద్యార్థులు శారీరకంగా మానసికంగా దృడంగా ఉండటమే గాక సమాజంతో పాటు కలిసి నడవాలని సూచించారు. ఒత్తిడి లేకుండా చదవాలని భవిష్యత్ ను  కాంక్షించాలన్నారు. ఏదైన అంశాన్ని సంతోషంగా నేర్చుకోవాలి మనచుట్టు ఉన్న పరిసరాలు, స్నేహితులతో, కుటుంబంతో మమేకమవుతు ఒత్తిడి తగ్గించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో  వాసవి విద్యా సంస్థల సెక్రటరీ జగదీష్ రెడ్డిగారు, కరస్పాండెంట్ పోతారెడ్డిగారు, అడ్వైజర్ మోహన్ రెడ్డి గారు, ప్రిన్సిపాల్స్ M. రాజ్ కుమార్ గారు, శ్రీనివాస్ శెట్టిగారు శైల జాయ్ సన్ గారు, సుహాసినిగారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గోన్నారు.

మరిన్ని వార్తలు