నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
21-09-2026 | 04:38pm
నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ(ACB) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. రూ.15 వేల లంచం తీసుకుంటుండగా జూనియర్ అసిస్టెంట్‌తో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి అధికారులు తదుపరి విచారణ చేపట్టారు.