వాణిజ్య దుకాణాల పరిశీలన
నిర్మల్ అక్టోబర్ 29 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్(SC Corporation) వాణిజ్య దుకాణాల సముదాయాన్ని అధికారులు గురువారం పరిశీలించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ ఉద్యోగులు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం(RDO Office) సమీపంలో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ భవన సముదాయంలోని ఖాళీ దుకాణాలను గురువారం టెండర్ల ద్వారా దక్కించుకున్న లబ్ధిదారులకు అప్పగించారు.
ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ.. దుకాణాలను సద్వినియోగం చేసుకుంటూ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలోపేతమై కుటుంబాలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పడిగెల రమణ, జూనియర్ అసిస్టెంట్ వెంకటరమణ, సిబ్బంది స్వామి తదితరులు పాల్గొన్నారు.