అడవుల పెంపకమే లక్ష్యం

29-10-2026 | 08:24pm

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో అడవుల విస్తీర్ణం(Expand Forest) పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని జిల్లా అటవీశాఖ అధికారి బాలమణి తెలిపారు. అటవీ డివిజన్ అధికారి అప్పయ్య(Asifabad District Forest Officer Balamani)తో కలిసి జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

జిల్లాలో ఇప్పటికే 33 వేల హెక్టార్లకు అటవీ హక్కు పత్రాలు అందించగా, మరో 38 వేల హెక్టార్లలో అక్రమ పోడు సాగు ఉన్నట్లు గుర్తించామన్నారు. గత నాలుగేళ్లలో అటవీ ప్రాంతాల్లో విద్యుత్ వైర్ల కారణంగా 27 జంతువులు, 29 మంది మృతి చెందారని, బాధితులకు రూ.85 లక్షల పరిహారం అందించామని తెలిపారు. అక్రమంగా సాగులో ఉన్న భూములను స్వాధీనం చేసుకొని వెదురు సహా వివిధ రకాల మొక్కలు పెంచుతామన్నారు. అడవుల సంరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు