సాయి మందిరంలో పూజలు, అన్నదానం

29-10-2026 | 08:26pm

చైర్మన్ నల్లపాటి నరసింహారావు

కోదాడ అక్టోబర్ 29(విజయ క్రాంతి): నల్లబండగూడెం రామాపురం క్రాస్ రోడ్(Ramapuram Cross Road) సమీపంలో గల సాయి మందిరంలో చైర్మన్ నల్లపాటి నరసింహారావు ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. చైర్మన్ నల్లపాటి నరసింహారావు మాట్లాడుతూ దాతల సహకారంతో భక్తులకు అన్నదానం నిర్వహించినట్లు తెలిపారు.

నల్లపాటి వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి దంపతులు తమ కుమార్తెలు మౌనిక, భవానీ తేజ, కుమారుడు చైతన్య కృష్ణ లు అన్నదానానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో అర్చకుడు సాయి శర్మ,, మండల పార్టీ అధ్యక్షులు అలసకాని శరబేశ్వరరావు, రంగారావు, ఆదినారాయణ, రామారావు, నల్లపాటి లింగారావు, ఈదర వెంకటేశ్వర్లు, నరసింహారావు గురువయ్య, ముండ్రా రామారావు, పూర్ణ, శ్యామ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు