నేలకొరిగిన పంటలను పరిశీలించిన అగ్రికల్చర్ అధికారులు
కూసుమంచి, అక్టోబర్ 29(విజయక్రాంతి): కూసుమంచి మండలంలోని గట్టుసింగారం, పెరికసింగారం, తుమ్మలతండా గ్రామాలలో బుధవారం కురిసిన వర్షానికి నేలకొరిగిన వరి పంటను సహాయ వ్యవసాయ సంచాలకులు రాజేష్ , మండల వ్యవసాయ అధికారిణి రామడుగు వాణి(Agricultural Officer Ramadugu Vani) పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు రైతుల ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం వరి పొలాలు పాలు పోసుకునే దశ నుండి గింజ గట్టి పడే దశలో ఉన్నందున, పడిపోయిన పొలాలు నీటిలో మునిగి ఉంటే ఒక లీటరు నీటికి 50 గ్రాముల ఉప్పును కలిపి ఆ ద్రావణాన్ని పిచికారి చేయడం వల్ల గింజ మొలకెత్తకుండా ఉంటుందని సూచించారు.
పొలాల్లో నిలువ ఉన్న నీటిని వెంటనే తీసేసి పొలాన్ని ఆరనివ్వాలని సూచించారు. అనంతరం పరికసింగారం గ్రామంలో యాసంగిలో వారికి ప్రత్యామ్నాయంగా వేసుకోవాల్సిన పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.