ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

29-10-2026 | 08:19pm

నంగునూరు: సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించి రైతులను ఆదుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు వల్లపు రెడ్డి రజినీకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నంగునూరు మండల కేంద్రంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ... తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, చేతికొచ్చిన పంట తడిసి పోతుందనే ఆందోళనలో రైతులు ఉన్నారని తెలిపారు.

తక్షణమే ప్రభుత్వం స్పందించి జిల్లాలోని అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సాగునీరు అందక నంగునూరు మండలంలో పంటలు ఎండిపోతున్నాయని మండల అధ్యక్షుడు చౌడుచర్ల వెంకట్ రామ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వీడి వెంటనే ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, లేని పక్షాన పాదయాత్ర చేపట్టి నిరసన తెలుపుతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు